దర్శకేంద్రుడు ఆవిష్కరించిన ‘అతడు ఆమె ప్రియుడు’

96
Athadu Aame Priyudu

దిశ, సినిమా : ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నటుడు సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకేంద్రుడు.. రచయితగా, దర్శకుడిగా ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న యండమూరి తెరకెక్కించిన చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు తనకు మంచి మిత్రుడే కాక గురువు లాంటివారని అన్నారు. ఇక ఆయన తమ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం శుభసూచకమని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..