టాలీవుడ్ హీరోయిన్‌‌కు యాక్సిడెంట్.. కాలికి గాయాలు

by  |
టాలీవుడ్ హీరోయిన్‌‌కు యాక్సిడెంట్.. కాలికి గాయాలు
X

దిశ, సినిమా : ‘బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసిన రాయ్ లక్ష్మి.. ప్రస్తుతం హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తోంది. శనివారం హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా కిండపడిపోయిందట. ఈ మేరకు ఆమె కాలికి గాయం కావడంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా యాక్షన్ ఎపిసోడ్ చేసినందుకు తనకు లభించిన ‘రిటర్న్ గిఫ్ట్’ ఇది అంటూ ‘క్వీన్ ఆఫ్ ఇంజురీస్’ అనే క్యాప్షన్‌తో ఫొటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది రాయ్ లక్ష్మి. ప్రస్తుతం ఆమె బానే ఉన్నట్లు మూవీ యూనిట్ సభ్యులు తెలపగా.. ఆ ఫొటోలను చూసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed