క్వారంటైన్ ట్రెండ్… డాల్గోనా కాఫీ

by  |
క్వారంటైన్ ట్రెండ్… డాల్గోనా కాఫీ
X

దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉండలేక ప్రజలు తమ పాకనైపుణ్యాలకు పదును పెడుతున్నారు. ఈ పాకనైపుణ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే ఒక కొత్త ట్రెండు… డాల్గోనా కాఫీ.

ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడే చూసినా… డాల్గోనా కాఫీ ఫొటోలే. దక్షిణ కొరియా నుంచి ప్రారంభమైన ఈ డాల్గోనా కాఫీ ట్రెండు ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం కరోనా వైరస్ లాగ వ్యాపించింది. మూడే మూడు పదార్థాలతో సులభంగా తయారుచేయగలగడం, చూడటానికి చాలా రిచ్‌గా కనిపిస్తున్న ఈ కాపీ లుక్కు అందర్నీ ఆకర్షిస్తోంది.

ఎలా తయారుచేయాలి?

దీన్ని తయారు చేయడానికి కావాల్సినవన్నీ ఇంట్లో రెడీగానే ఉంటాయి. రెండు స్పూన్ల కాఫీ పొడి, రెండు స్పూన్ల చక్కెర, ఇంకా రెండు స్పూన్ల వెచ్చని మంచి నీళ్లు, అరకప్పు పాలు ఉంటే చాలు… డాల్గోనా కాఫీ ఐదు నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ముందుగా కాఫీ పొడి, చక్కెర, నీళ్లు కలిపి బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమం మొత్తం ముదురు గోధుమ రంగు క్రీమ్‌లా మారే వరకు విప్ చేయాలి. తర్వాత దీన్ని గ్లాసులో పోసి ఉంచిన పాల మీద ఉంచి తాగేయడమే. కావాలంటే రెండు ఐస్ ముక్కలు వేసుకుని కోల్డ్ డాల్గోనా కూడా తయారుచేసుకోవచ్చు. ఇంకేం.. మీరు కూడా డాల్గోనా కాఫీ తయారు చేసుకుని, ట్రెండ్ ఫాలో అయిపోండి.

Tags: Dalgona Coffee, Trend, Tik tok, Quarantine, lockdown

Next Story

Most Viewed