హైదరాబాద్‌లో కూడా క్యుమిన్ ఫుడ్ డెలివరీ

by  |
హైదరాబాద్‌లో కూడా క్యుమిన్ ఫుడ్ డెలివరీ
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ముంబై, న్యూ ఢిల్లీ, చెన్నై, పూణే, బెంగళూరు, కోల్‌కతా నగరాలలో నాణ్యమైన ఫుడ్ డెలివరీ చేస్తున్న క్యూమిన్ ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సిఎల్) హైదరాబాద్ నగరంలో కూడా తమ గౌర్మెట్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది, వినియోగదారులకు వివిధ రకాల గృహ శైలి , ఆరోగ్యకరమైన రోజువారీ ఆహారాన్ని సులభంగా అందిస్తామని, శాఖాహారం , మాంసాహార ఎంపికలలో సాధారణ భోజనం తో పాటు విందు కోసం రోజువారీ మారుతున్న మెనూను అందిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్‌‌లో అందుబాటులో రానున్నాయని, రాబోయే నెలల్లో ఇతర నగరాలకు విస్తరిస్తామని సంస్థ పేర్కొంది. రోజు, వారం, నెల వారిగా కూడా అవసరం ఉన్న వారికి ఫ్రీ పెయిడ్ ద్వారా వారు ఎంచుకున్న ఆహారాన్ని అందిస్తామని తెలిపింది. మూంగ్ దాల్, పన్నీర్ మఖ్నీ వంటివే కాకుండా బటర్ చికెన్ , వివిధ రకాల భారతీయ రొట్టెలు, ఫ్రైడ్ గ్రీన్స్ , హక్కా నూడుల్స్ వంటివి కూడా డోర్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది . వివరాల కోసం 1800 266 7646 కు కాల్ చేయాలని కోరింది.



Next Story

Most Viewed