సింధు ‘పతకం’ మరువొద్దు.. నేడు సెమీస్ దంగల్

by  |
PV Sindhu
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుపైనే భారతీయులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సింధు ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్ మెడల్ సాధించాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఇండియా అథ్లెట్లు ఒక్క వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మినహా మిగతా క్రీడల్లో అంతగా రాణించలేకపోయారు. టఫ్ ఫైట్ ఇస్తున్నా.. మెడల్ సాధించే వరకు వెళ్లలేకపోయారు. అయితే, శనివారం బ్యాడ్మింటన్ సెమీస్ మ్యాచ్ జరగనుంది. గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న పీవీ సింధు ప్రపంచ నెంబర్ వన్ తైజుయింగ్ (చైనీస్ తైపీ)తో తలపడనుంది.

కాగా, వీరిధ్యరి మధ్య హోరాహోరి పోరు ఉండనున్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సింధు తైజుయింగ్ తో 18 సార్లు తలపడగా కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఈ ఏడాది తైజు ఆడిన 15 మ్యాచుల్లో 12 విజయం సాధించిందంటే ఆమె ఎంత పవర్ ఫుల్ క్రీడాకారిణో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ నెంబర్ వన్ స్థానం తైజుయింగ్ సొంతమైనా ఆమె ఇంతవరకు ఒలింపిక్ మెడల్ సాధించలేకపోవడం ఆమె కెరీర్‌లో రీమార్క్‌గా మిగిలిపోయింది. అయితే, 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు తైజుయింగ్‌ను ఒడించి రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed