పూరీ జగన్నాథ ఆలయం ఓపెన్

by  |
పూరీ జగన్నాథ ఆలయం ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించి సర్వం మూతపడాల్సి వచ్చింది. అందులో భాగంగానే ఇంతకాలం మూతపడిన ఒడిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయం ఎట్టకేలకు ఆదివారం తెరుచుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఆలయ అధికారులు పలు నిబంధనలు విధించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా రిపోర్ట్​ సమర్పించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నెగెటివ్​ రిపోర్ట్​ ఉన్నవారికే దర్శనం ఉంటుందని వెల్లడించారు. అంతేగాకుండా ఆ రిపోర్టును సంబంధిత అధికారులకు సమర్పించాలని తెలిపారు.

Next Story