ఢిల్లీలో పంజాబ్ సీఎం ధర్నా

by  |
ఢిల్లీలో పంజాబ్ సీఎం ధర్నా
X

న్యూఢిల్లీ: అగ్రి చట్టాలపై పోరాటాన్ని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీకి తీసుకెళ్లారు. జంతర్‌మంతర్‌‌లో బుధవారం ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాకు దిగారు. పంజాబ్‌పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని ఆరోపించారు. రాష్ట్రాలకు రావల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించడం లేదని, విపత్తు నిర్వహణ నిధి నుంచీ నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఆర్థిక సమస్యలను రాష్ట్రాలు ఎలా అధిగమించాలని ప్రశ్నించారు.

తొలుత ధర్నాను రాజ్‌ఘాట్ దగ్గర ప్లాన్ చేసినప్పటికీ భద్రత కారణాల రీత్యా వేదికను జంతర్‌మంతర్‌కు తరలించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు చెక్ పెడుతూ పంజాబ్ అసెంబ్లీ పాస్ చేసిన చట్టాలు అమల్లోకి రావడానికి రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కోసం పంజాబ్ అభ్యర్థించగా, ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం ఢిల్లీలో ధర్నాకు దిగారు.



Next Story

Most Viewed