హోటల్లో దండలు మార్చుకుని, ఏడడుగులు వేసి.. మా పెళ్లి అయిపోయిందన్న లవర్స్.. కానీ!

158

దిశ, వెబ్‌డెస్క్ : హోటల్ గదిలో దండలు మార్చుకుని, ఏడడుగులు వేసిన ఓ జంట తమకు వివాహం అయిపోయిందని కోర్టును నమ్మించే యత్నం చేసింది. తాము కలిసి ఉండేందుకు అనుమతి ఇప్పించాలని, ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని లవర్స్ కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ప్రేమికులు మరియు వారి తల్లిదండ్రుల తరఫున వాదనలు విన్న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అది విని ప్రేమపక్షులకు బుర్ర తిరిగినంత పనైంది. దీనిని పెళ్లిగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి అనేది సంప్రదాయ బద్ధంగా ఇరు కుటుంబాల సమక్షంలో జరగాలని, లేనియెడల చట్టపరంగా జరగాలని తీర్పులో పేర్కొంది.

వివరాల్లోకివెళితే.. ఇటీవల పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఓ వింత కేసు విచారణకు వచ్చింది. ఇద్దరు లవర్స్ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, వీరు ఓ హోటల్‌లో గది కిరాయికి తీసుకుని రహస్యంగా దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఒక పాత్రలో నిప్పంటించి దాని చుట్టూ ఏడు అడుగులు వేశారు. అనంతరం ఇరు కుటుంబ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారు. తమకు పెళ్లి జరిగిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు.

అది కాస్త కోర్టు మెట్లెక్కడంతో ఇరు పక్షాల తరఫున వాదనలు విన్న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిని పెళ్లిగా పరిగణించలేమని సంచలన తీర్పు చెప్పింది. అంతేకాకుండా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ఈ జంటకు రూ.25 వేల జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..