పూణెలో మినీ లాక్‌డౌన్

by  |
పూణెలో మినీ లాక్‌డౌన్
X

ముంబయి: అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనాకు అడ్డుకట్ట వేయడానికి క్రమంగా ఆంక్షలు పెంచుతున్నది. తాజాగా పూణెలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధించడంతోపాటు వారం రోజులపాటు రెస్టారెంట్లు, బార్లు, మాల్స్, పవిత్రస్థలాలను మూసి ఉంచాలని ఆదేశించింది. అయితే, రాత్రి 10 గంటల వరకు ఫుడ్ పార్సిల్, డెలివరీ సర్వీసులకు అనుమతినిచ్చింది.

ఈ నగరంలో ప్రభుత్వ బస్సులనూ నిలిపేయనుంది. అత్యవసర సిబ్బందికి మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నది. శనివారం నుంచి అమల్లోకి రానున్న ఈ ఆంక్షలపై వచ్చేవారం శుక్రవారం రివ్యూ చేయనుంది. పూణెలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. అనంతరం పూణె డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు ఈ ఆంక్షలను ప్రకటించారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వేడుకలపై వచ్చే శుక్రవారంపై నిషేధం అమలవుతుందని వివరించారు. వివాహ వేడుకకు గరిష్టంగా 50 మందికి, అంతిమ సంస్కారాలకు గరిష్టంగా 20 మందికి మించి అనుమతి లేదని వెల్లడించారు.



Next Story

Most Viewed