అప్పుడు.. ఇప్పుడు కెప్టెన్ ధోనీనే: పుజార

by  |
అప్పుడు.. ఇప్పుడు కెప్టెన్ ధోనీనే: పుజార
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా నయా వాల్ చతేశ్వర్ పుజార ఏడేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్ ఆడబోతున్నాడు. మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా పుజార ఒక వీడియోలో ‘ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉంది. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు ధోనీనే కెప్టెన్. ఇప్పుడు ఎల్లో జెర్సీలో ఐపీఎల్‌లో మళ్లీ ధోనీతో ఆడబోతున్నాను. ఇందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని అన్నాడు. టెస్టుల్లో ఆడటానికి ఐపీఎల్‌లో ఆడటానికి చాలా తేడా ఉంటుందని.. ఇందుకోసం తన ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉందని పుజార అన్నాడు. తప్పకుండా సరైన సన్నద్దతతో ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తానని పుజార చెప్పాడు. ఐపీఎల్‌లో చివరి సారిగా 2014లో పంజాబ్ తరపున పుజార ఆడాడు.

Next Story

Most Viewed