‘బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించండి’

by  |
BC-reservations 1
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: స్థానిక సంస్థలలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ను ఆయన నివాసంలో కలిసి బీసీల సమస్యలను విన్నవించారు.

ఈసందర్భంగా రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థలలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత లేకపోవటంతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరితో బీసీలు రాజకీయంగా చాలా నష్టపోతున్నారని అన్నారు. రాజ్యాంగ భద్రత కల్పించడం ద్వారానే బీసీలకు మేలు జరుగుతుందని అన్నారు. అలాగే త్వరలో చేపట్టబోయే జనగణనలో బీసీ కులాల గణన చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. బీసీ గణన ఉంటేనే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు.దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడి బీసీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed