జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి : హైదరాబాద్ ప్రెస్ క్లబ్

by  |
జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి : హైదరాబాద్ ప్రెస్ క్లబ్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కోవిడ్ బారిన పడుతున్న జర్నలిస్టులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి రాజమౌళి చారిలు శనివారం తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ను కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజహితం కోసం ఆపదలను సైతం లెక్క చేయకుండా విధుల్లో ఉన్న జర్నలిస్టులు, కోవిడ్ మహమ్మారి బారిన పడి చనిపోతున్న ఘటనలు సభ్య సమాజంలో ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు.

గత 20 రోజులలో సుమారు 15 మంది జర్నలిస్టులు కోవిడ్ తో చనిపోయారని, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రులలో బెడ్లను కేటాయించవలసిన అవసరం ఉందన్నారు. సిఫారసు చేయిస్తే తప్ప బెడ్లు దొరకని పరిస్థితి ఉందని, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించకపోవడంతోనే అనేక మంది టీకా వేసుకోలేకపోయారని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా జర్నలిస్టులను కోవిడ్ నుండి కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.



Next Story

Most Viewed