చలికాలంలో ఈ లోషన్స్ వాడుతున్నారా.. జాగ్రత్త

237

దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చిందటే చాలు చర్మపొడిబారడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో తమ చర్మాన్ని కాపాడుకోవడానికి చాలా మంది క్రీమ్స్, లోషన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక కొంత మంది లోషన్స్ కాకుండా పిండి లాంటివి వాడుతుంటారు. ఇలా ప్రకృతికి సంబంధించినవి వాడినా కొంత మంది చర్మం పొడిబారినట్టుగా ఉండటం, పగుళ్లు ఏర్పడటం జరుగుతోంది. ఈ కాలంలో హానికరమైన సూర్యకిరణాలు మనం ముఖం మీద పడడం వలన ఇలాంటి సమస్యలు ఏర్పడుతాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టి, మన చర్మాన్ని కాపడుకోవాలంటే ఈ కాలంలో సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిందే. సన్ స్క్రీన్ లోషన్ హానికరమైన సూర్యకిరణాలు మన ముఖం మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ, ఈ లోషన్స్‌లో కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెట్టేవి ఉంటాయి. వాటిని వాడటం వలన సన్ బర్న్, ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే మనం సరైన ప్రొడక్ట్ చూసి తీసుకొని వాడాలి. ఇంతకీ ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడుతే సమస్యలు వస్తాయో చూద్దాం.

ఫోటో కెమికల్ అండ్ ఫోటో బయోలాజికల్ సైన్స్‌లో పబ్లిష్ అయిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే.. జింక్ ఆక్సైడ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ వలన నెగటివ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలంలో జింక్ ఆక్సైడ్‌తో కూడిన సన్‌స్క్రీన్‌లోషన్ అప్లై చేసుకున్న రెండు గంటల తరువాత ఫలితం లేకుండా పోతుంది. అదే విధంగా దీని వల్ల సమస్యలు వస్తాయి. స్కిన్ అలర్జీ, ఇరిటేషన్ , సన్ బర్న్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. అంతే కాకుండా ఈ జింక్ ఆక్సైడ్‌తో కూడిన సన్‌స్క్రీన్‌లోషన్ రాస్తే యూవీ కిరణాల నుండి రక్షణ లభించదు.  అందుకే వీలైనంత వరకు వీటిని వాడకుండా ఉండడం మంచిది.

అదే విధంగా సన్ స్క్రీన్, ఇతర ప్రొడక్ట్స్‌లో జింక్ ఆక్సైడ్ ఉంటుంది. జింక్ ఆక్సైడ్ తో కూడిన సన్ స్క్రీన్ లోషన్‌ని ముఖం మీద రాసుకుంటే చర్మ సమస్యలు వస్తాయి. అలాగే సన్‌స్క్రీన్‌లోషన్‌లో జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం, డయాక్సైడ్ లేదా ఇతర సన్‌స్క్రీన్ లోషన్ ని ఎక్కువ కాంబినేషన్స్‌తో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఈ కాలంలో మనం మన చర్మాన్ని కాపాడుకోవాలంటే జింక్ ఆక్సైడ్‌తో కూడిన సన్‌స్క్రీన్‌లోషన్ వాడకపోవడం కొంత వరకు మంచిదని నిపుణల అభిప్రాయం. ఇదే కాకుండా ఇతర కెమికల్స్ వల్ల కూడా సన్‌స్క్రీన్‌లోషన్ నెగెటివ్ ప్రభావం తీసుకొస్తుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..