నిర్మాత చేతిలో మల్లెపూల గుత్తి.. రిప్లయ్ ఇచ్చిన హీరోయిన్

by  |
Mallepuv
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విశాల్ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా‌లో ఒక మహిళకు సంబంధించిన ఎమోషనల్ స్టోరీని పంచుకున్నాడు. మల్లెపూలు విక్రయించే లేడీని షూటింగ్ గ్యాప్‌లో కలిశానన్న విశాల్.. చేతిలో పూలగుత్తి పట్టుకున్న ఫొటో షేర్ చేస్తూ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న ఆమె లైఫ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ‘సీపీ ఢిల్లీలో రాత్రిపూట పూలు విక్రయించేందుకు సాహిబాబాద్ నుంచి వచ్చిన మహిళకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాలేజ్‌లో చదువుతున్న వారిద్దరికీ తనే ఆధారం కాగా.. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో నైట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాని అబద్దం చెప్పి ఆమె ఇక్కడ పూలు విక్రయిస్తోంది. నిజం తెలిస్తే వాళ్ల చదువులు డిస్టర్బ్ అవుతాయనేది ఆమె ఉద్దేశ్యం. అందుకే కొన్నిసార్లు అబద్దాలు కూడా చాలా ప్రేమగా, అందంగా ఉంటాయి కదా’ అని పోస్ట్ చేశాడు. కాగా ఆమె స్టోరీ విన్న విశాల్.. ఆమె పూలగంపను మొత్తం కొనేసి హెల్ప్ చేశాడు.

ఈ క్రమంలో విశాల్ పోస్ట్ పై ఫ్రెండ్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగా.. తనతో ‘సాత్ ఖూన్ మాఫ్’ మూవీలో పనిచేసిన ప్రియాంక చోప్రా ‘వాహ్’ అని రిప్లయ్ ఇచ్చింది. ఇక అతని వైఫ్ రేఖా భరద్వాజ్ సైతం హార్ట్ ఎమోజీస్‌ పోస్టు చేసింది.


Next Story

Most Viewed