డ్రీమ్ బిగ్ గర్ల్స్.. ఏదైనా సాధ్యమే : ప్రియాంక చోప్రా

by  |
డ్రీమ్ బిగ్ గర్ల్స్.. ఏదైనా సాధ్యమే : ప్రియాంక చోప్రా
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠం జో బైడెన్ సొంతమైన విషయం తెలిసిందే. ట్రంప్ టెంపరితనంతో బైడెన్ గెలుపును అంగీకరించకున్నా.. ప్రజా తీర్పును ఎవరూ కాదనలేరు. ఈ మేరకు బైడెన్ ఎన్నికపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం బైడెన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శుభాభినందనలు తెలుపుతూ.. గొప్ప కలలు కనమంటూ మహిళలకు పిలుపునిచ్చింది.

‘ప్రతి ఓటు కౌంట్ అవుతోంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో.. అమెరికా ప్రజలు తమ రికార్డ్ ఓటింగ్‌తో చాటి చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కంగ్రాట్స్. అమ్మాయిలు.. గొప్ప కలలు కనండి. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ ఎన్నికైంది. ఏదైనా సాధ్యమే.. ప్రజాస్వామ్యం రాక్స్. కంగ్రాట్యులేషన్స్ టు అమెరికా’ అని ప్రియాంక తన ఇన్‌స్టా వేదికగా తెలిపింది.

https://www.instagram.com/p/CHTD-gyD0et/?utm_source=ig_web_copy_link

అవెంజర్స్‌లో హల్క్ రోల్ పోషించిన మార్క్ రఫాలో కూడా జో బైడెన్ ఎంపికపై తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశాడు. ‘వీ ఆర్ సో హ్యాపీ టుడే’ అని ఆయన ట్వీట్ చేశాడు.

‘అమెరికా ప్రజలారా న్యూ కమాండర్ ఆఫ్ చీఫ్, ఫస్ట్ ఫిమేల్ వీపీని వైట్‌హౌజ్‌కు పంపిస్తూ.. ధైర్యమైన, గొప్పదైన తీర్పుని ప్రపంచానికి అందించారు’ అని లేడీ గాగా ట్వీట్ చేసింది.

https://www.instagram.com/p/CHTBGpAMKEP/?utm_source=ig_web_copy_link

Next Story