వైద్యులు దేవుడి ప్రతిరూపాలు : ప్రధాని మోడీ

by  |
PM Modi
X

న్యూఢిల్లీ: వైద్యులు ఈశ్వరుడి ప్రతిరూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని ప్రధాని వివరించారు. వైద్యులను ఊరికే ఈశ్వరుడి ప్రతిరూపాలనీ అనరని, నిజంగానే వారిలో అంతటి సమరశీలత, దయ, త్యాగం, కరుణ గుణాలు మమేకమై ఉంటాయని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు తమ ప్రాణాలు లెక్కచేయకుండా వైరస్‌తో ఎదురుండి పోరాడారని, తమ ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజా సేవలో మునిగారని ప్రశంసించారు.

కరోనా వైరస్ మ్యుటేషన్‌లతో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, అందుకు అనుగుణంగా వైద్యులూ అంతకంతకూ నైపుణ్యాలు పెంచుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మరణాల రేటు ఇప్పటికీ బాగున్నదని, మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన క్రెడిట్ వైద్యులకే దక్కుతుందని చెప్పారు. వైద్యుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు. వైద్యులపై హింసకు వ్యతిరేకగా కఠిన చట్టాలు తెచ్చామని, కరోనా వారియర్ల కోసం ఉచిత ఇన్సూరెన్స్ కవర్ స్కీమ్‌నూ తీసుకువచ్చామని వివరించారు. టీకాపై భయాందోళనలు, అపనమ్మకాలను తొలగించడంలో వైద్యుల పాత్ర కీలకమైందని, ఇకపైనా టీకాలపై అవగాహనను పెంచుతూ పోవాలని సూచించారు. కరోనా అనంతరం సమస్యల నుంచి ఉపశమనం కోసం యోగా ప్రాక్టీస్ చేయడం, అందుకు సంబంధించిన శాస్త్రీయ వివరణలను వైద్యులు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

Next Story

Most Viewed