- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అది ఒక్కటే ఆయుధం.. ఒమిక్రాన్‌పై ప్రధాని మోడీ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంతో పాటు, దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఒమిక్రాన్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కొవిడ్‌పై పోరాటం చేసేందుకు ఐసీయూ బెడ్స్, నాన్ ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో ఉంచామన్నారు. అయినప్పటికీ ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని నొక్కి చెప్పారు.
ఇప్పటికే వ్యాక్సిన్ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే మారు మూల గ్రామల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించామని గుర్తు చేశారు. గత ఏడాది కాలంలో ఎన్నో కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని చెబుతూనే.. భారత్ సమర్థంగా వైరస్‌ను ఎదుర్కొంటుందన్నారు.
15-18 ఏజ్ గ్రూప్ వారికి వ్యాక్సినేషన్..
దీనికి తోడు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలవుతున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికితోడు కరోనా నియంత్రణలో కీలక సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్లకు బూస్ట్ డోస్ ఇస్తామని మోడీ ప్రకటించారు.
- Tags
- india