మెరుగైన వైద్యం అందిస్తున్నాం

by  |
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రికవరీ రేటు 71శాతం, మరణాల రేటు 0.7శాతం ఉందని, కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని సీఎం అన్నారు. పడకలు, మందులు, ఇతర పరికరాలు, సామాగ్రి సిద్ధంగా ఉంచామని, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేందబృందాల సలహాలు పాటిస్తున్నామని మంగళవారం సీఎంలతో ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయన్నారు.

అందుకే జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులను నియమించడంతో పాటు, వైద్య కాలేజీలు ఏర్పాటుపై ఆలోచించాలన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసే ఈ ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా కరోనా లాంటి వైరస్‌లు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రధాని మోడీ చొరవ చూపాలని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు.

Next Story