రూ. 200 కోట్లు సమీకరించిన ప్రీమియర్ ఎనర్జీస్

by  |
solar
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోలార్‌ పీవీ సెల్స్‌, మాడ్యూల్‌ తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జీఈఎఫ్ కేపిటల్ నుంచి రూ. 200 కోట్లను సమీకరించినట్టు శుక్రవారం వెల్లడించింది. దేశీయంగా సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిధులను మూలధన అవసరాలకు వినియోగించనున్నట్టు తెలిపింది. ప్రీమియర్‌ ఎనర్జీస్‌కు లావాదేవీ నిర్వహించేందుకు సెంట్రమ్‌ కేపిటల్‌ ప్రత్యేక సలహాదారుగా ఉంది. అలాగే, ఈ నిధులను 2 గిగావాట్ల సోలార్ సెల్ తయారీకి, 2 గిగావాట్ల మాడ్యూల్ తయారీకి కేటాయించనుంది.

అంతేకాకుండా రాబోయే రెండేళ్లలో అదనంగా రూ. 1,200 కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా కలిగి ఉంది. ‘సంస్థ వాటాదారుల వృద్ధి అంచనాలను చేరుకునే దిశగా వెళ్తున్నాం. ఇదే సమయంలో స్థిరమైన వనరులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని’ ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సాలుజా చెప్పారు. ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా భారత్‌లోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటె సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సంస్థగా కొనసాగుతోంది. 2020లో ఈ సంస్థ 25 ఏళ్ల సుధీర్ఘ కార్యకలాపాలను పూర్తి చేసుకుంది.


Next Story