ప్రాచీన గుహలో పెయింటింగ్స్.. నియోండర్తల్స్ ఆర్టిస్టులా?

by  |
ప్రాచీన గుహలో పెయింటింగ్స్.. నియోండర్తల్స్ ఆర్టిస్టులా?
X

దిశ, ఫీచర్స్ : స్పెయిన్‌లో ప్రాచీన చరిత్రకు చెందిన గుహ చిత్రాలు(కేవ్ పెయింటింగ్స్) లభించాయి. దాదాపు 40వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన నియాండర్తల్స్(పురాతన జాతి) ఈ చిత్రాలు వేసినట్టుగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. వీటిని పరిశీలించిన మీదట.. మోడర్న్ హ్యూమన్స్‌గా పరిగణించబడే హోమో సేపియన్స్‌తో నియోండర్తల్స్‌కు సంబంధాలు లేవని గతంలో వెల్లడించిన అధ్యయనాలు నిజమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం దొరికిన కేవ్ పెయింటింగ్స్ అదే విషయాన్ని నిరూపిస్తున్నాయని తెలిపారు.

దక్షిణ స్పెయిన్‌, మాలాగా సమీపంలోని ఆర్డల్స్ గుహల్లోని స్టాలగ్‌మైట్స్(ఖనిజ నిక్షేపాలు)పై కనుగొన్న ఎరుపురంగు మట్టితో చిత్రాలను 65వేల ఏళ్ల క్రితం నియాండర్తల్స్ సృష్టించినట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌(PNAS) జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. కాగా ఈ గుహ చిత్రాలు తయారుచేసినపుడు ప్రపంచంలో మోడర్న్ హ్యూమన్స్ ఉనికిలో లేరు. ఈ మేరకు దాదాపు 40వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన నియాండర్తల్స్.. హోమో సేపియన్స్‌కు అధునాతన బంధువులు కాదనే సాక్ష్యాలకు కొత్త పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి. 15 నుంచి 20వేల సంవత్సరాల వరకు ఈ గుహల్లోని పిగ్మెంట్స్ వేర్వేరు సమయాల్లో తయారు చేయబడ్డాయని అధ్యయనం కనుగొంది. దీంతో ఇప్పటిదాకా భావించినట్లు అవి మానవ నిర్మితం కాకుండా సహజ ఆక్సైడ్ ప్రవాహ ఫలితంగా ఏర్పడ్డాయనే వాదన తప్పని అర్థమైంది.

‘ఈ ఆనవాళ్లు నియాండర్తల్స్ పట్ల మన వైఖరిని మారుస్తాయి. వారు మనుషులకు దగ్గరగా ఉండేవారని స్పష్టమవుతోంది. వస్తువులను ఇష్టపడ్డారని, మనుషులతో జతకట్టారని ఇటీవలి పరిశోధనలో తెలియజేయగా.. మనలాగే గుహ చిత్రాలను రూపొందించారని తెలుస్తోంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు జావో జిలావో తెలిపారు. ఇక ఫ్రాన్స్‌లోని చావెట్-పాంట్ డి’ఆర్క్ గుహలో కనుగొన్న ప్రాచీన ఆధునిక మానవులు వేసిన వాల్ పెయింటింగ్స్ 30వేల సంవత్సరాల కంటే పాతవి.



Next Story

Most Viewed