మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్.. కొడుకు ముందే ఆమెకు ముద్దులిస్తూ

by  |
మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్.. కొడుకు ముందే ఆమెకు ముద్దులిస్తూ
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మళ్లీ పెళ్లిచేసుకున్నారు. తన కుమారుడి ముందే ఈ వివాహ వేడుక జరగడం విశేషం. ఛీ ఛీ ఇంత దారుణమా.. అని మండిపడకండి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఆయన భార్యనే.. తన కుమారుడి వేదాంత్ కోరిక మేరకు ఆయన భార్యనే మరోసారి వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి.

ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చి కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని 2010లో వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వేదాంత్ తల్లిదండ్రుల వివాహ మహోత్సవం చూడాలని ఉందని కోరడంతో ప్రకాష్ రాజ్, పోనీవర్మ మరోసారి పెళ్లిచేసుకున్నారు. వారి 11వ వివాహ వార్షికోత్సవంలో మరోసారి ఈ జంట వధూవరులుగా మారారు.”మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం” అంటూ ఫోటోలను ఆయన షేర్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ్ లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరో పక్క ‘మా’ ఎలక్షన్స్ కోసం సంసిద్దం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

షాకింగ్: మరోసారి లీకైన హీరోయిన్ నగ్న వీడియో..


Next Story

Most Viewed