ప్రజావాణి రద్దు.. రీజన్ ఇదే!

95
covid

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కరోనా ఉధృతి నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశం, రాష్ట్రంలో కోవిడ్-19 ఉధృతి కారణంగా ప్రజలు ఒక్కచోట గుమికూడడం శ్రేయష్కారం కాదని, ఆర్జీదారులు ఇట్టి విషయాన్ని గమనించాలని కోరారు. సమర్పించే ఆర్జీలలో ఎక్కువగా భూ సంబంధిత, పెన్షన్ సంబంధమైనవి ఉంటున్నాయని తెలుపుతూ భూసమస్యల పరిష్కారానికి ధరణి ఫోర్టల్ లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఆర్జీదారులు అందచేసిన సమస్యల దరఖాస్తులను ఆయా తహశీల్దార్లలకు పంపించడం జరుగుతుందని, అలాగే పెన్షన్ సంబంధించినవి కూడా మీసేవా ద్వారా, సదరం క్యాంపుల ద్వారా పరిష్కారం పొందగలరని ప్రజల ఆరోగ్యం, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.