ఈనెల 24న నిరుద్యోగులు ఛలో ప్రగతి భవన్

by  |
ఈనెల 24న నిరుద్యోగులు ఛలో ప్రగతి భవన్
X

దిశ, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆగస్టు 24వ తేదీన పీ.డీ.ఎస్.యు, పీ.వై.ఎల్ సంఘాలు నిర్వహించే ఛలో ప్రగతి భవన్ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుండి నిరుద్యోగులు తరలిరావాలని పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రభుత్వ ఉపాధి కల్పిస్తుందని, వందలాది మంది విద్యార్థులు రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చారని, కానీ ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదని, పైగా ప్రభుత్వం అసమర్థత వల్ల రాష్ట్రంలో వరుసగా నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు చేత పట్టుకొని కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు.

కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి ఖాళీగా ఉన్న లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగుల ఆవేదన ప్రగతి భవన్ కి తెలపడం కోసం పీ.డీ.ఎస్.యు, పీ.వై.ఎల్ సంఘాలు నిర్వహించే ఛలో ప్రగతి భవన్ కార్యక్రమానికి వేలాదిగా నిరుద్యోగ యువత కదలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు జిల్లా అధ్యక్ష,కార్యదర్శిలు నరేష్,శ్రీకాంత్,జిల్లా సహాయ కార్యదర్శి సంధ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story