కరెంట్ పోయిందా.. ఈ నంబర్ కు ఫోన్ చేయండి

by  |
కరెంట్ పోయిందా.. ఈ నంబర్ కు ఫోన్ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా విద్యుత్ విభాగం అప్రమత్తమైంది. వర్షం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూపెరింటెండింగ్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్‌లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి సమీక్షించారు. గ్రేటర్‌లో భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయాలని రఘుమా రెడ్డి చెప్పారు. వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed