బ్యాటరీ తయారీ కోసం రూ. 185 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన పవర్ గ్లోబల్

by  |
battery1
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ ఉత్పత్తుల స్టార్టప్ కంపెనీ పవర్ గ్లోబల్ భారత్‌లో బ్యాటరీ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పెట్టుబడులను ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. దేశీయంగా లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్, బ్యాటరీ మౌలిక సదుపాయాల కోసం 25 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 185 కోట్ల)ను పెట్టుబడి పెట్టనుంది. ఉత్తరప్రదేశ్‌లో 1 గిగావాట్ అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న కంపెనీ దాదాపు 8 లక్షల సాంప్రదాయ త్రీ-వీలర్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ‘బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాము. ఒక గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 4 లక్షల బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని’ పవర్ గ్లోబల్ ఇండియా సీఈఓ పంకజ్ దూబె అన్నారు. 2022లో ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో రానున్న రెండు మూడేళ్లలో రూ. 185 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 55 లక్షల త్రీ-వీలర్ వాహనాలు రోడ్లపై ఉన్నాయి.. రాబోయే 5-6 ఏళ్లలో దాదాపు 15 శాతం వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చేందుకు ప్రణాళికను కలిగి ఉన్నామని తెలిపారు.

Next Story

Most Viewed