విద్యుత్ ఉద్యోగుల ధర్నా.. ఫిబ్రవరి నుంచి సమ్మె చేస్తామని వార్నింగ్

by  |
nizamabad-11
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విద్యుత్​ ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పవర్ హౌజ్ కంపౌండ్ లో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో1104 యూనియన్ కంపెనీ అధ్యక్షుడు రఘునందన్ మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఫిబ్రవరి 1 నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డిఈలు ఎండి ముక్తార్, వెంకటరమణ, జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్, నాయకులు జి. శ్రీనివాస్, కాశీనాథ్, సురేష్ కుమార్, అశోక్ , రాజేందర్, గంగాధర్, రామ్ సింగ్, బాబా శ్రీనివాస్, ఎ. రాజేందర్, మన్మోహన్, రమణ, గంగ శేఖర్, శ్యామ్, సుమిత, విజయలక్ష్మి, సతీష్, అశోక్, బోధన్ జేఏసీ చైర్మన్ శివ ప్రసాద్, పద్మ రాణి, పీఓ పోశెట్టి, బాలచందర్ తోపాటు దాదాపు 300 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed