పోస్టుమాన్‌ గల్లంతై 24గంటలైనా…

10

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలో మంగళవారం కుమ్మరించిన వర్షానికి నాగోల్ బండ్లగూడలోని మల్లికార్జున నగర్‌లో పోస్టుమాన్‌ సుందరరాజు గల్లంతయ్యాడు. అదే సమయంలో అక్కడున్న స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. నిన్న రాత్రే పోస్టుమాన్‌ కొడుకు ఎల్బీనగర్‌ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు గాలింపు చర్యలు చేపట్టలేదు. కనీసం అధికారులు గల్లంతైన ప్రదేశానికి కూడా రాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 24గంటలు గడిచినా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమంటూ ప్రజలు మండిపడుతున్నారు.