కమిషన్లకు కక్కుర్తి.. ఏడాదికే కుప్పకూలిన బ్రిడ్జి.. తప్పెవరిది..?

by  |
కమిషన్లకు కక్కుర్తి.. ఏడాదికే కుప్పకూలిన బ్రిడ్జి.. తప్పెవరిది..?
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామపంచాయతీలో ప్రజల కోసం నిర్మించిన బ్రిడ్జి ముడునాళ్ల ముచ్చట అనే విధంగా బ్రిడ్జి నిర్మించారని గ్రామస్థులు బలంగా ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీలో నిర్మించిన బ్రిడ్జి ఏడాదికే కుప్పకూలిపోవడం దుర్మార్గమని గ్రామప్రజలు మండిపడుతున్నారు. గ్రామంలో నాణ్యతలేని బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని ప్రజలు విమర్శిస్తున్నారు. బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్ సరైన ఇసుక, ఇటుక, ఐరెన్, సిమెంట్ లాంటివి ఉపయోగించకపోవడమే ఈ బ్రిడ్జి కూలిపోవడానికి కారణమని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు.

నీకు ఎంత.. నాకు ఎంత అన్నట్లు అధికారుల వ్యవహారం..

నియోజకవర్గంలో కొంతమంది కాంట్రాక్టర్లు సరైన కట్టడాలు నిర్మించకుండా కమిషన్లకే పరిమితమవ్వుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ చేసిన నిర్మాణ కట్టడాన్ని చూడకుండా నీకు ఎంత..నాకు ఎంత అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామప్రజలు, పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ప్రజల కోసం నిర్మించిన బ్రిడ్జి కూలిపోతే ఇప్పటివరకు ఏ ఒక్కఅధికారి కూడా పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.చిన్న పిల్లలు, గర్భవతి మహిళలు, వృద్ధులు ఈ బ్రిడ్జిపై వెళ్లాలంటే భయబ్రాంతులకు గురువ్వుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.నిన్న కాక మొన్న ఒక మహిళ బ్రిడ్జి మీద నుంచి క్రింద పడ్డారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు కమిషన్లకు అలవాటు పడి నిర్మాణాలు సరైన క్వాలిటీతో నిర్మించడంలేదని గ్రామస్థులు, పలువురు వాపోతున్నారు.

ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టి సారించాలి..

కరకగూడెం మండలం రఘునాధపాలెంలో ప్రజలు పడే ఇబ్బందులపై ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరారు. బ్రిడ్జి లేక నానా ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కమిషన్లకు అలవాటు పడటం వల్లే ఈబ్రిడ్జి కూలిపోవడానికి కారణమని గ్రామస్థులు తెలుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు,కలెక్టర్ కోసం రఘునాధపాలెం గ్రామస్తులు ఎదురుచూస్తున్నరని సమాచారం. మరి రఘునాధపాలెం గ్రామంలో బ్రిడ్జిని ఎవరు పట్టించుకుంటారో వేచిచూడాల్సిందే..

Next Story

Most Viewed