నాలుగు రాష్ట్రాలు, యూటీలో పోలింగ్ షురూ

by  |
నాలుగు రాష్ట్రాలు, యూటీలో పోలింగ్ షురూ
X

న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోం సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 475 నియోజకవర్గాల్లో సుమారు 20 కోట్ల ఓటర్లు తమ ప్రతినిధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికలు ఈ సింగిల్ ఫేజ్‌లో పూర్తవనున్నాయి. అసోంలో చివరి(40 సీట్లలో) లేదా మూడో విడత ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 విడతలకు గాను మూడో దశ(31 స్థానాల్లో) పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, పుదుచ్చేరిలలోని మొత్తం 30 సీట్లకు పోలింగ్ మొదలైంది. ఈ రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో ప్రజలు తమ ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. అసోంలో నేటి పోలింగ్‌తో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. కాగా, బెంగాల్‌లో మరో ఐదు విడతల పోలింగ్ ఇంకా జరగాల్సి ఉంటుంది. వీటితోపాటు కేరళలోని మలప్పురం, తమిళనాడులోని కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ నేడు పోలింగ్ జరుగుతున్నది. వీటన్నింటికి మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.



Next Story

Most Viewed