AP Politics: అన్నీ డ్రామాలే.. అన్నపై చెల్లి సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 3 |
AP Politics: అన్నీ డ్రామాలే.. అన్నపై చెల్లి సంచలన వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో అన్నాచెల్లిల్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో అన్న జగన్మోహన్ రెడ్డి కోసం పోరాటం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అన్నపైనే పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భాధ్యతలు తీసుకున్న తరువాత షర్మిల జోష్ పెంచారు. పలు ప్రచార కార్యక్రమలు చేపట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.

ఇక ఆమె పాల్గొన్న ప్రతి సభలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేసిన అభివృద్ధిని చూపించాలని ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తోంది. ఇక జగన్ సీఎం అయినా తరువాత రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడుతోంది. ఇచ్చిన ఒక్క మాటైనా నిలుపుకున్నావా..? అని సొంత అన్నని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెద్ద కోటలో నివసించే సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయని సిద్ధం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. వైఎస్ రాజాశేఖర్ రెడ్డి హయంలో ప్రజాదర్బార్ ఉండేదని, ఆ ప్రజాదర్బార్ ఇప్పడు ఎందుకు లేదని ప్రశ్నించారు. జగన్ తన స్వలాభం కోసం రాష్ట్ర ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి సీఎం మనకి అవసరమా..? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదాని ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఆశీర్వదించమని ప్రజలను కోరారు.

Next Story