జగనన్న భవన్ ప్రారంభం

by Dishafeatures2 |
జగనన్న భవన్ ప్రారంభం
X

దిశ, నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ లో జగనన్న భవన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జగనన్న భవన్ ను నెల్లూరు జిల్లాలోనే ప్రారంభించామన్నారు. 2024 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి, ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తామని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లడంతో పాటు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకే జగనన్న భవన్ ఏర్పాటు అయింది అన్నారు.

జగనన్న భవన కార్యకర్తలు అందరికి అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జగనన్న భవన్ ప్రారంభానికి వచ్చిన తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మీడియా సమావేశంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్, మూలపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లోకి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ గోగుల్ నాగరాజు, దార్ల వెంకటేశ్వర్లు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Next Story