రాహుల్‌ గాంధీని కలిసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

by GSrikanth |
రాహుల్‌ గాంధీని కలిసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నేతలు కలిశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని సోమవారం రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్తూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపు ఆగారు. ఈ సమయంలో రాహుల్ గాంధీని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీతో పాటు మరికొంత మంది రాష్ట్ర నేతలు కలిశారు. ఈ సందర్భాంగా రాహుల్‌కు రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

Next Story