ఎన్నికల వేళ సమంతను వాడేసుకుంటున్న టీడీపీ.. సెన్సేషనల్ వీడియో వైరల్

by Disha Web Desk 6 |
ఎన్నికల వేళ సమంతను వాడేసుకుంటున్న టీడీపీ.. సెన్సేషనల్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో పొలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది తమకు నచ్చిన పార్టీలో చేరి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా పోటీపోటీగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత గతంలో షేర్ చేసిన వీడియో ఒకటి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకప్పుడు సమంత తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆ వీడియోను షేర్ చేసింది.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో సామ్ ఫ్యాన్స్ దాన్ని షేర్ చేస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. అందులో ‘‘ నేను మీ సమంత అభివృద్ధికి మీ ఓటు చేయండి. సైకిల్ గుర్తుకే ఓటు వేయండి’’ అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే టీడీపీకి ఆమె సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పడంతో ఆ పార్టీ వారు సంతోష పడుతున్నారు. ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. కానీ కొందరు మాత్రం టీడీపీ సామ్‌ను వాడుకుంటుందని నెట్టింట చర్చించుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్దపడుతోంది. మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించివని హెల్త్‌ పరంగా పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

Next Story