దేశ గౌరవాన్ని తగ్గించేందుకు కొందరి ప్రయత్నం.. రాహుల్ పై రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

by Dishafeatures2 |
దేశ గౌరవాన్ని తగ్గించేందుకు కొందరి ప్రయత్నం.. రాహుల్ పై రాజ్‌నాథ్ సింగ్ ఫైర్
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు వ్యక్తులు దేశ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లక్నోలో శనివారం ఉద్యోగ్ వ్యాపార్ మండల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని యూరోప్, అమెరికాలను జోక్యం చేసుకోవాలని కోరారు. భారత అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు బాధపెడుతాయి. కొందరు వ్యక్తులు కావాలనే గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు’ అని అన్నారు.

పాకిస్తాన్‌లోని ప్రజలు కూడా మోడీ తరహాలో వేగవంతమైన పాలనను కోరుకుంటున్నారని అన్నారు. 2014కు భారత ఆర్థిక వ్యవస్థ 11 ర్యాంకులో ఉందని తొమ్మిదేళ్లలో బ్రిటన్‌ను నెట్టి ముందుకు వచ్చిందని చెప్పారు. మరో ఐదేళ్లలో టాప్-3లో నిలుస్తామని తెలిపారు. కాగా, అంతకుముందు రాహుల్ లండన్ పర్యటనలో భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని అన్నారు. యూరోప్, యూఎస్‌లు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది.

Also Read..

న్యాయ వ్యవస్థ దేశీయీకరణ జరగాలి.. సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలు


Next Story

Most Viewed