షాకింగ్ న్యూస్.. టీఆర్ఎస్, వైసీపీని వెనక్కి నెట్టిన టీడీపీ

by Disha Web Desk |
షాకింగ్ న్యూస్.. టీఆర్ఎస్, వైసీపీని వెనక్కి నెట్టిన టీడీపీ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ మరోసారి సత్తా చాటింది. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను వెనక్క నెట్టి దూసుకుపోయింది. అయితే ఇది ఎన్నికల్లో సాధించిన ఫలితం కాదు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు వివరాల్లో వైసీపీ, టీఆర్ఎస్‌ను టీడీపీ వెనక్కి నెట్టింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఖర్చులు విపరీతంగా వెచ్చిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 17వ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు 2019లో ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు వివరాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పార్టీలు అన్ని కలపి రూ. 3,046 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు జాతీయ పార్టీలు కలిసి రూ. 2,278 కోట్లు, అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి రూ. 668 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అన్నింటి కంటే బీజేపీ రూ.1,264 కోట్ల ఖర్చు చేసి టాప్ లో ఉండగా రూ.820 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా ధన ప్రవాహం

తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిపి చేసిన వ్యయం రూ. 227 కోట్లు కాగా ఇందులో టీడీపీ రూ.131 కోట్లు ఖర్చు చేసి మొదటి స్థానంలో ఉంది. వైసీపీ రూ.86 కోట్ల వ్యయంతో రెండో స్థానంలో నిలవగా, టీఆర్ఎస్ మాత్రం రూ.9.53 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇక ఎంఐఎం కేవలం రూ.71,961 ఖర్చు చేసినట్లు పేర్కొంది. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఒక్కో అభ్యర్థి సగటున రూ.50.85 లక్షలు ఖర్చు చేసినట్లు అది ఏపీలో సగటున ఒక్క అభ్యర్థి రూ.30.50 లక్షలు, తెలంగాణలో రూ. 48.61 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.

బీజేపీ టాప్ అన్నాడీఎంకే లాస్ట్

గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మొత్తం ఖర్చు చేసిన 13 పార్టీలను గమనిస్తే బీజేపీ రూ.1264.33.57.790 ఖర్చు చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ రూ.820,89,33,152 తో రెండో స్థానంలో, బీజేడీ రూ.228,59,81,580 మూడో స్థానం, టీడీపీ రూ.131,32,28,295 నాలుగో స్థానం, ఐదో స్థానంలో వైసీపీ రూ.86,15,29,310, ఆరో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ రూ.83,60,27,952, ఏడో స్థానంలో ఎన్సీపీ రూ.72,35,25,714, ఎనిమిదో స్థానంలో డీఎంకే రు.79,26,10,482, తొమ్మిదో స్థానంలో బీఎస్పీ రూ.55,39,02,696, పదో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ రూ.50,65,92,236, పదకొండో స్థానంలో సీపీఐ రూ.46,36,74,187,పన్నెండో స్థానంలో సీపీఎం రూ.34,93,52,177, పదమూడో స్థానంలో ఏఐఏడీఎంకే రూ.20,46,60,771 ఖర్చు చేసినట్లు పేర్కొంది.


Next Story

Most Viewed