మోడీని చూసి చేతబడి చేసే వ్యక్తి అనుకున్నారేమో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

by Dishafeatures2 |
మోడీని చూసి చేతబడి చేసే వ్యక్తి అనుకున్నారేమో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఆదివారం రాత్రి పాపువా న్యూ గినీ దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ప్రధాని జేమ్స్ మరాపె భారత ప్రధాని కాళ్లు మొక్కి తమ దేశంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక మోడీ కృషి వల్లే ప్రపంచంలో భారత్ కు సముచిత గౌరవం లభిస్తోందని బీజేపీ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా తాజాగా ఈ ఘటనపై శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ప్రధాని మోడీని చేతబడి చేసే వ్యక్తితో పోల్చారు.

మోడీని చూసి పాపువా న్యూ గినీ ప్రజలు భారత్ నుంచి ఓ పెద్ద మంత్రగాడు వచ్చారని భావించారని, అందుకే ఆయనకు దాసోహం అయ్యి ఆయన కాళ్లు మొక్కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపువా న్యూ గినీ చరిత్రను పరిశీలిస్తే అక్కడ బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) సర్వసాధారణం అనే విషయం అర్థమవుతుందని చెప్పారు. అక్కడి ప్రజలు చేతబడిని పాటిస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే మోడీని చూసి తమకు బ్లాక్ మ్యాజిక్ నేర్పించడానికి భారత్ నుంచి ఓ వ్యక్తి వచ్చినట్లు వాళ్లు అనుకున్నారని, అందుకే మోడీ కాళ్లకు మొక్కి స్వాగతం పలికారని ఎద్దేవా చేశారు.

‘‘పీఎం మోడీ పెద్ద మనిషి. ఆయనను కలిసినప్పుడు మేము కూడా ఆయనకు కాళ్లకు నమస్కరిస్తాం. గతంలో నెహ్రూ, శాస్త్రి, ఇందిరా గాంధీ వంటి భారత్ ప్రధానులు వేరే దేశాల్లో పర్యటించినప్పుడు ఇలాంటి గౌరవాన్ని ఎన్నోసార్లు పొందారు. కానీ వాళ్లు ఏనాడు దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. కానీ నేడు బీజేపీ నేతలు వేరే దేశ ప్రధాని భారత ప్రధాని కాళ్లు మొక్కారు’’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పీఎం మోడీని తప్పక గౌరవించాల్సిందేనని, కాకపోతే ఈ విషయంలో బీజేపీ నేతలు ఆయనను అనవసరంగా ఆకాశానికెత్తుతున్నారని విమర్శించారు.



Next Story

Most Viewed