సిట్ పేరుతో ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు.. బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

by Dishafeatures2 |
సిట్ పేరుతో ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు..  బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం సిట్ ను నియమించలేదని, అది కేవలం పోలీస్ కేసేనని, సిట్ వేసినట్లు ప్రజలను ఫూల్స్ ని చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విచారణ పెండింగ్ లో పెట్టేందుకే సిట్ పేరుతో హడావుడి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు ఆగిపోయిందని, డేటా చోరీ, నోటుకు ఓటు కేసులన్నీ ఏమయ్యాయో తమకు తెలుసన్నారు.

ఎన్సీఆర్బీ నివేదికలో తెలంగాణ ఏసీబీ అవినీతి నిరోధక కేసులను ఛేదించలేకపోవడంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. టీఎస్ పీఎస్సీ నిభందనల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లోకి చైర్మన్ కూడా వెళ్లడానికి రూల్ లేదని, అలాంటిది పేపర్లు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే రాష్ట్రపతికి అప్పగించాలని, అప్పుడే దోషులు ఎవరనేది తేలుతారని ఆయన వెల్లడించారు. ప్రస్తుత బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును నియమించి పరీక్షలు నిర్వహించాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed