ముద్రగడపై సినీ నటుడు పృధ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 3 |
ముద్రగడపై సినీ నటుడు పృధ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, పిఠాపురం: నేడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం స్టార్ క్యాంపెనర్ గా ఉన్న పృథ్వీరాజ్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అని, కాపులు ఆయనను నమ్ముకుని మోసపోయారని సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ మండిపడ్డారు.

ఇక కాపులకు నిజాయితీగా పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కరే అని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి ప్రజల కోసం పనిచేస్తానన్న పవన్ కళ్యాణ్ ను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు ఉద్యమం పేరుతో అందరినీ మోసం చేశారని ఆరోపించారు. కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా రాష్ట్రంలోని కాపులంతా కలిసి పవన్ అడుగుజాడల్లో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముద్రగడ పద్మనాభం కాపులను ఎవరిని ఎదగకుండా చేశారని , చివరకు జగన్ తో కూడా కుమ్మక్కవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మొలతాడు కోసం మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం ముందు ఆయనకు మొలతాడు ఉందో లేదో చూసుకోవాలని హితవు పలికారు.

ఇలాంటి నాయకుడిని ఇప్పటి వరకు కాపులంతా మోసారని, ఇది కాపులకు తీరని అన్యాయం అన్నారు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని పృద్వి ధీమా వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని ప్రగల్బాలు పలికిన జగన్ అండ్ కో పార్టీ ఇప్పుడు వనికి పోతుందని పృద్వి ఎద్దేవ చేశారు.

పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే జగన్ చేసే అక్రమాలు బయటపడతాయి అన్న భయం వారిలో ఉందన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారని ఇక స్వీట్లు పంచుకోవడమే తరువాయి అని పృద్వి ధీమా వ్యక్తం చేశారు. నగిరి నాయకురాలు రోజాకి కూడా భారీగా స్వీట్లు తీసుకువెళ్తామని ఇది కచ్చితంగా జరుగుతుందని అన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని ఆయన ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజల కోసమే నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఏకైక లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారని.. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించడం వల్లే ఆయనకు భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారన్నారని పృద్వి స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా పవన్ తీర్చి దిద్దుతారని భరోసా తాము ఇవ్వగలమని ఆయన పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed