కేంద్రం చేతిలో కీలుబొమ్మ మేఘాలయ సీఎం : ముకుల్ సంగ్మా

by Disha Web Desk 16 |
కేంద్రం చేతిలో  కీలుబొమ్మ మేఘాలయ సీఎం : ముకుల్ సంగ్మా
X

షిల్లాంగ్: మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మాపై టీఎంసీ నేత ముకుల్ సంగ్మా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్రాడ్ ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కీలుబొమ్మ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా మౌషిన్‌రూట్ పట్టణంలో తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలు నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అధ్వర్యంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

సీఎం కన్రాడ్ సంగ్మా కేవలం ఢిల్లీ నియమించిన కీలుబొమ్మ మాత్రమే' అని అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్పీపీ బీజేపీతో పొత్తు వీడి ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రజలు, తెగలు, సంస్కృతి, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ఒంటరిగా బరిలోకి దిగుతామని ఎన్పీపీ ప్రకటించింది. ప్రస్తుత ప్రాక్సీ-బిజెపి ప్రభుత్వం తమ ప్రజల ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడంలో అసమర్థంగా ఉందని ముకుల్ ఆరోపించారు. ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని ఆయన కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అవతరించింది.

ఎన్పీపీ కంటే స్వల్ప సీట్ల మెజారిటీ సాధించింది. అయితే బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలతో పొత్తు కూడా ఎన్పీపీ మేఘాలయ డెమోక్రటిక్ అలియన్స్(ఎండీఏ)ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా, 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది టీఎంసీలో చేరారు. తాజాగా అసోంతో సరిహద్దు ఒప్పందానికి కాన్రడ్ సంగ్మాను అమిత్ షా ఒప్పించారని విమర్శించారు.



Next Story

Most Viewed