- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Mamata Banerjee: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మమతా బెనర్జీ ఫోన్

దిశ, వెబ్‌డెస్క్: Mamata Banerjee Phone Call To CM KCR To Attend The Meeting Of Opposition Parties| ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈనెల 15న జరిగే విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావాలని కేసీఆర్‌ను మమతా ఆహ్వానించారు. అంతేగాక, ఈ సమావేశంలో పాల్గొనాలని దాదాపు దేశంలోని 22 మంది జాతీయ నేతలకు మమతా బెనర్జీ లేఖలు పంపించారు. ఈ సమావేశంలో భారత రాష్ట్రపతి ఎన్నికపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ త్వరలో భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు విస్తృతమైన తరుణంలో బెంగాల్ ముఖ్యమంత్రి సమావేశానికి రావాలని కోరడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మరి వీరి మధ్య ఎలాంటి చర్చ జరుగనుందో, సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిందే.
Also Read: 'టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలే నమ్మడం లేదు'