రైలు ప్రమాదాన్ని రాజకీయం చేస్తోంది.. బెంగాల్ సీఎంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఫైర్

by Javid Pasha |
రైలు ప్రమాదాన్ని రాజకీయం చేస్తోంది.. బెంగాల్ సీఎంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదాన్ని తన రాజకీయ స్వార్ధం కోసం వాడుకోవాలని చూస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అక్కడి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. రైలు ప్రమాద బాధితులకు నేతాజీ ఇండోర్ స్టేడియంలో రేపు మమతా బెనర్జీ చెక్కులు పంపిణీ చేయబోతోందని, ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బాధితులకు లేనిపోనివి నూరిపోస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నవాళ్లతో నీచ రాజకీయాలు చేస్తోందని దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎంసీ పార్టీ కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ఆ కంపెనీ చైర్మన్ అని, అభిషేక్ బెనర్జీ కంపెనీ ఎండీ అని ఆయన ఎద్దేవా చేశారు. సౌగతా రాయ్ ఆ కంపెనీ ఉద్యోగి అని అన్నారు. మమతా బెనర్జీ చేసేదంతా కూడా ఫోటో షూట్ కోసమేనని, బెంగాల్ లో జీరో మెడికల్ సౌకర్యాలు ఉన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.



Next Story