నూతన సచివాలయంలో ఏం జరుగుతుంది?.. సీబీఐ డైరెక్టర్ జైస్వాల్‌‌కి కేఏపాల్ లేఖ

by Dishafeatures2 |
నూతన సచివాలయంలో ఏం జరుగుతుంది?.. సీబీఐ డైరెక్టర్ జైస్వాల్‌‌కి కేఏపాల్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సచివాలయ భవనంలో ఏం జరుగుతుంది.. సీఎం ఛాంబర్స్ ఫ్లోర్‌లోని ఆరవ అంతస్తులో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కొత్త సచివాలయం ఫైర్ యాక్సిడెంట్‌పై దర్యాప్తు జరపాలని సీబీఐ డైరెక్టర్ జైస్వాల్‌కి లేఖ రాశారు. లేఖ కాపీలను హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాలకు పంపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 31న కొత్త సచివాలయ భవనాన్ని సందర్శించకుండా తనను కార్యాలయంలో పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. కొత్త సెక్రటరేట్‌ భవనంలో 'నరబలి' లాంటివి జరుగుతున్నాయని అనుమానం వ్యక్తంచేశారు.

ఫిబ్రవరి 3న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, అక్కడికి మాత్రం మీడియాను, నేతలకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. దాదాపు 11 అగ్నిమాపక వాహనాలు మంటలను ఆపడానికి వచ్చాయని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని, అప్పటి వరకు భవనాన్ని సీల్ చేయాలని, కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. కొత్త సెక్రటరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ఎందుకు ఓపెన్ చేయాలి? అసలు పాతది ఎందుకు కూలగొట్టారు? అని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి రోజే భవనాన్ని ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed