- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
హైడ్రాపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ ఆర్మూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కాల్చడాలు కూల్చడాలు, పేల్చడాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడిన వీడియో ఆర్మూర్ లోని పలు సోషల్ మీడియా గ్రూపులో వైరల్ అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట రాష్ట్ర రాజధాని హైదరాబాదులో హై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని, స్కాముల పార్టీ అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ కాలంలో గరీబోంకో హటావో అంటే.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గరీబొంకో బగావో అనే పరిస్థితి తయారైందన్నారు. వెంటనే హైదరాబాదులో హైడ్రా పేరుతో చేపడుతున్న కూల్చివేతలను నిలిపివేసి హైడ్రాను రద్దు పరచాలన్నారు. అలాగే రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా, రేషన్ కార్డులకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అన్నారు. రైతులతో, పేదలతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, పేదలకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలను మానుకొని రైతులకు రుణమాఫీ ఇవ్వాలన్నారు. హైడ్రా విషయంలో రాష్ట్ర హైకోర్టు పేదల పక్షాన నిలవడం పట్ల ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాట్సాఫ్ తెలిపారు.