బీజేపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి Gali Janardhan Reddy రాజీనామా

by Disha Web Desk 2 |
బీజేపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి Gali Janardhan Reddy రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. అంతేగాకుండా.. కళ్యాణ రాజ్యప్రగతి పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటకలో రాజకీయాలో గాలి జనార్ధన్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారాడు.

ఒకప్పుడు బళ్లారి రాజకీయాలను శాసించిన గాలి జనార్ధన్‌ రెడ్డి ఇప్పుడు గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. బళ్లారిలో తన హవా తగ్గినందునే స్థానమార్పు కోరుకుంటున్నారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అంతేగాకుండా.. అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి బీజేపీ పార్టీ రాజకీయంగా ఆయనను కాస్త దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు. ఇక బీజేపీ సైతం కీలక కార్యక్రమాలకు గాలిని దూరంగానే పెట్టింది. ఒకప్పుడు బళ్లారిలో బీజేపీ పార్టీ జెండా ఎగరడానికి గాలి జనార్దన్‌రెడ్డే కారణం అని ఆయన సన్నిహితులు కొందరు అంటున్నా మరికొందరు పార్టీ గొప్పది.. ఆయన కాకుంటే ఇంకొక్కరు అనే రీతిలో ప్రస్తుత బీజేపీ పార్టీ నాయకులు అన్నారు. ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ పెట్టి సత్తా చాటాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆదివారం కొత్త పార్టీ ప్రకటించినట్లు సమాచారం.

Also Read...

మునుగోడు బైపోల్ తర్వాత CM KCRలో మార్పు!

Next Story

Most Viewed