టీడీపీ బూతు వీడియోల కోసం పోరాటాలు

by Disha Web Desk 16 |
టీడీపీ బూతు వీడియోల కోసం పోరాటాలు
X

దిశ,ఏపీబ్యూరో: ప్రజల తరఫున కాకుండా టీడీపీ బూతు వీడియోల కోసం పోరాటాలు చేసిన స్థాయికి టీడీపీ దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం మార్ఫింగ్‌ వీడియోతో అనైతిక రాజకీయాలు చేస్తుందన్నారు. దీంతో టీడీపీ మరోసారి దాని దిగజారుడుతనాన్ని బయట పెట్టుకుందన్నారు. గోరంట్ల వీడియోపై దర్యాప్తు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అనడం హాస్యస్పదంగా ఉందన్నారు.

టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీ బాబాయే పార్టీ లేదు..బొక్కా లేదని చెప్పాడాని అయితే ఇప్పుడు నువ్వు టీడీపీని బతికించే పనిలో పడ్డావా? అని అపహాస్యం చేశారు. ఒక లోక్‌సభ సభ్యుడిని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అప్రతిష్టపాలు చేయటం కోసం టీడీపీ అనేక కుట్రలు చేస్తుందన్నారు. అసలు అప్‌లోడ్‌ చేసిన గోరంట్ల వీడియో ఎక్కడిది? అది మీకు ఎక్కడ నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. అది వాస్తవమైతే.. ఐటీడీపీకి చెందిన నంబర్లతో పరాయి దేశాల నుంచి ఎందుకు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వనికి ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్‌ల ఫోన్ల నుంచే అప్‌లోడ్‌ చేయవచ్చు కదా అని నిలదీశారు.

Next Story