హామీలను నెరవేర్చని ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Disha Web Desk 11 |
హామీలను నెరవేర్చని ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, జడ్చర్ల: గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, కోయిలసాగర్, ప్రాజెక్టులు కడతామని చెప్పి కట్టి చూపించామని చెప్పారు.

కుర్చి వేసుకుని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ ప్రకటన కేవలం ఓట్ల కోసమే తప్ప అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ తో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లా రైతుల పొలాల్లో కృష్ణానది జలాలను పారిస్తామని చెప్పారు. కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఈ నెల 25వ తేదీన జడ్చర్ల పట్టణంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రజలను కోరారు.

Also Read..

శుభ సమయాల్లో చెడు శకునం రాహుల్.. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా

Next Story

Most Viewed