కాంగ్రెస్ నేతలు టూరిస్టులు.. ఎమ్మెల్సీ కవిత ధ్వజం

by Javid Pasha |
కాంగ్రెస్ నేతలు టూరిస్టులు.. ఎమ్మెల్సీ కవిత ధ్వజం
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ టూరిస్టులు అంటూ సైటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మోడల్ ని ఏ పార్టీకి కూడా విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడు, "టూరిస్టులు" ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదని హితవు పలికారు.

కాగా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులును విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ కు కౌంటర్ గా కవిత పై విధంగా స్పందించారు.

Next Story

Most Viewed