బండి సంజయ్ చేసిన తప్పేంటి?: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Dishafeatures2 |
బండి సంజయ్ చేసిన తప్పేంటి?: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించారు. ఏం తప్పు చేశారని బండి సంజయ్ ను అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. కేసీఆర్ ఫాసిస్ట్ ధోరణికి ఇది నిదర్శనమని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఆ ఫ్రస్టేషన్ లో సీఎం కేసీఆర్ అక్రమ అరెస్టులకు పాల్పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేేకే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని అన్నారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed