మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంల ఎంపికపై కసరత్తు

by Disha Web Desk 2 |
మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంల ఎంపికపై కసరత్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. ఈ క్రమంలోనే ఇవాళ బీజేపీ సీఎంల ఎంపికపై స్పీడ్ పెంచింది. ఈ సందర్భంగా బీజేపీ ఇవాళ సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది.

రాజస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, వినోద్ తావడే, సరోజ్​పాండేను నియమించింది. మధ్యప్రదేశ్‌కు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కే.లక్ష్మణ్, ఆశా లక్రాను ప్రకటించింది. ‌ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రులు అర్జున్​ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్​గౌతమ్‌ను పరిశీలకులుగా నియమించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశమై సీఎం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, సీఎం అభ్యర్థులుగా ఈ రాష్ట్రాల్లో సీఎం పదవి కోసం చాలా సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.


Next Story

Most Viewed