తెలంగాణ తల్లి విముక్తి కోసమే పాదయాత్ర.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

by Dishafeatures2 |
తెలంగాణ తల్లి విముక్తి కోసమే పాదయాత్ర.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, ఇచ్చోడ : వందలాది మంది త్యాగాల పునా దుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, తొమ్మిదేళ్ల నుంచి సీఎం కేసీఆర్, వారి కుటుంబం చేతితో బందీ అయ్యిందని, తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాథ్‌ సే హాథ్‌ జోడో పాద యాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత మల్లు బట్టి విక్ర మార్క అన్నారు. హాథ్ సే హాథ్ జోడో పద యాత్రలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఇచ్చోడ నుంచి సిరికొండ వరకు పాద యాత్ర చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం సిరికొండ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణతో పేగు బంధం ఉన్నది కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమేనని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా కూడా, ఇక్కడి ప్రజలు చిరకాల స్వప్నం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇచ్చిన మాట తప్పకుండా అధినేత్రి సోనియా గాంధీ తెలంగా ణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి ధన దాహానికి రైతులు వ్యవసా యం బంద్‌ చేసి భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తే, తెలంగాణ ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ వాటిని మూతబడేలా చేశారని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఇస్తూ, రైతులకు రావాల్సిన సబ్సిడీ పథకాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా రాకుండా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు.

దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ..

ప్రజల ఆస్తులు, దేశ సంపదను తన స్నేహితు డైన అదానీకి ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని అన్నారు. అదానీ కేవలం పదేండ్లలోనే ప్రపంచం లో అతి కుబేరుడిగా ఎదిగేందుకు ప్రధాని మోడీ సహకరించాడని ఆరోపించారు. దేశాన్ని కాపాడ టం కోసమే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేపడితే, రాష్ట్రాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ హాథ్ సే హాథ్ జోడో ద్వారా పాదయాత్రను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రం లోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఈ ప్రభుత్వాలను ప్రజలు బంగాళాఖా తంలో తొక్కేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షులు సాజీద్ ఖాన్, బోథ్ బ్లాక్ అధ్యక్షులు మైముద్ ఖాన్, కళ్లెం నారాయణ రెడ్డి, గండ్రత్ సుజత, ఆడే గజేందర్, జాన్టీ, వెన్నెల అశోక్, కంచం లక్ష్మణ్, సాదుల్లా, మాధవ్ పటేల్, కార్యక ర్తలు పాల్గొ న్నారు.


Next Story

Most Viewed